అదేంటో తెలియక తలగోక్కుంటున్న రామ్ చరణ్
3am friend-ఇప్పుడు ఈ పదం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి సెలబ్రిటీలు చాలా ఆతృతగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ తేజ 3am friend సరైన అర్థం ఏమిటో చెప్పండి అంటూ తన ట్విట్టర్లో ట్వీటాడు.
చెర్రీ అడిగిన ప్రశ్నపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరికి తోచిన విధంగా వారు సమాధానం ఇచ్చారు. (నువ్వు నా 3am friend, అర్థమైందా!! దానికి చాలా పెద్ద సైద్ధాంతిక వివరణ ఉంది)... అంటూ సమాధానం ఇచ్చాడు రాణా దగ్గుబాటి. రచయిత బివిఎస్ రవి దీనిపై రిప్లయ్ ఇస్తూ...“మన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సురక్షితంగా ఇంట్లో దిగబెట్టే సన్నిహిత స్నేహితుడు ." అంటూ పేర్కొన్నారు. దర్శకుడు దేవా కట్ట దీనిపై స్పందిస్తూ...“ఎమర్జెన్సీలో మనకు మొదట గుర్తుకు వచ్చే స్నేహితుడు''సమాధానం ఇచ్చాడు.
అసలు ఈ పదం ఇంత చర్చ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. త్రిష గత కొన్ని రోజుల క్రితం ఓ దిన పత్రికతో మాట్లాడుతూ....రాణా దగ్గుబాటి my 3am friend అంటూ పేర్కొంది. రాణా కూడా ఆ మధ్య ఓ మ్యాగజైన్ తో మాట్లాడూ...చరణ్ తన 3am friend ఫ్రెండ్ గా చెప్పుకొచ్చాడు. మరి మీకేమైనా...దాని అర్థం తెలిసి ఉంటే చెర్రీకి రిప్లయ్ ఇవ్వండి.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే...త్రిష రాణాను 3am friend అనడంతో ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందనే వార్త కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతోంది.


Click it and Unblock the Notifications











