రామ్ చరణ్-ఉపాసన నిశ్చితార్థ వేడుక హైలెట్స్...!
నభూతో నభవిష్యతి... అన్న మాటకు నిజమైన అర్ధంలా నిలిచింది రామ్ చరణ్ వివాహ నిశ్చితార్ధం వేడుక. బాబాయ్ పవన్ కల్యాణ్ తన కొత్తగా కొన్న బెంజ్ కారులో రామ్ చరణ్ ని ఎక్కించుకుని, స్వయంగా తనే డ్రైవ్ చేస్తూ వేడుక స్థలికి తీసుకువచ్చారు. ఇద్దరూ చాలా కాలం తర్వాత గంట సేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేదిక ప్రదేశమైన టెంపుల్ ట్రీస్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఈ వేడుకకు విచ్చేశారు. అతిధులను చిరంజీవి స్వయంగా రిసీవ్ చేసుకుని ఆసీనులను గావించారు. పురోహితుల వేదమంత్రోచ్చారణ నడుమ కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుక మొత్తం ఒక భారీ తెలుగు సినిమాను తలపించింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని తెలుగు టీవీ చానెల్స్ అన్నీ లైవ్ టెలీకాస్ట్ చేశాయి.
అతిథులంతా కాబోయే యువజంటకు తమ దీవెనలు అందించారు. ఇటు సినీతారల తళుకు బెళుకులు అటు రాజకీయ నేతల హడావుడితో ..నిశ్చి తార్థ వేదిక సందడి సందడిగా కనిపించింది. చెర్రీ కుటుంబ సభ్యులు ఓ వైపు ఉపాసన తరపు బంధువులు మరోవై పు..అతిథులను వేడుకకు ఆహ్వానిస్తూ..తమ వంతు హడావుడి చేశారు. వేడుకకు పెద్ద సంఖ్యలో వీఐపీలు వీవీఐపీలు తరలి రావడంతో అక్కడ మూడంచెల్లో గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు.
సినీ ప్రముఖుల్లో..డారామానాయుడు, డాఅక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, రవితేజ, అమల జయసుధ, త్రిష, తమన్నా, బ్రహ్మానందం, కె. రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్, కోడి రామకృష్ణ, రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, అరవింద్, నాగబాబు, సత్యనారాయణ తదితరులు వేడుక లో పాల్గొన్నారు. నిశ్చితార్థం ఆద్యంతం చెర్రీ చాలా హుషారుగా గడిపాడు. అదే వేదికపై చూపరు ల కళ్లు ఓ చిన్నారిపై తదేకంగా నిలిచాయి. తోడపెళ్లి కొడుకుగా చరణ్ మేనల్లుడు సుస్మిత తనయుడు చేసిన సందడిపైనే వారంతా దృష్టి నిలిపారు. అహూతులకు ఏమాత్రం విసుగు కలుగకుండా ప్రత్యేక నృత్యకార్య క్రమాలు అలరించాయి. చరణ్-ఉపాసనల పెళ్లి 2012లో జరగనుంది. నేడు స్నేహితులకు గోవాలో చెర్రీ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











