రాంచరణ్‌ని సర్‌ప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్.. త్వరలో కలుస్తా!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంతో అభిమానులని పలకరించాడు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రాంచరణ్ మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాంచరణ్ కు జపాన్ అభిమానుల నుంచి ఓ సర్‌ప్రైజ్ అందింది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

బాహుబలి తర్వాత
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇండియాతో పాటు దేశ విదేశాల్లో కూడా బాహుబలి చర్చనీయాంశంగా మారింది. జపాన్ లో డబ్ చేసి బాహుబలి చిత్రాన్ని విడుదల చేశారు. బాహుబలి అక్కడ కూడా ఘనవిజయం సాధించింది,. బాహుబలి తర్వాత రాజమౌళి చిత్రాలకు కూడా జపాన్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీనితో గత ఏడాది రాంచరణ్ మగధీర చిత్రాన్ని జాపనీస్ లోకి అనువదించి విడుదల చేశారు. మగధీర చిత్రం జపాన్ లో మంచి విజయం సాధించింది.

పుట్టినరోజు సంధర్భంగా
మార్చి 27న రాంచరణ్ తన 34వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. మగధీర చిత్రంలో రాంచరణ్ కు జపాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. చరణ్ పుట్టినరోజు సంధర్భంగా అతడికి జపాన్ అభిమానుల నుంచి 50కి పైగా గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. జపాన్ అభిమానుల మగధీర చిత్రాలతో పంపిన గ్రీటింగ్ కార్డ్స్ చూసి ఆశ్చర్యపోయిన చరణ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

త్వరలో కలుస్తా
జపాన్ అభిమానుల నుంచి స్వీట్ సర్‌ప్రైజ్ అందుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలో మిమ్మల్ని కలవాలని ఉంది అని రాంచరణ్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందించాడు. తనకు గ్రీటింగ్స్ పంపిన అభిమానుల పేర్లని కూడా పొందుపరిచాడు.

అల్లూరి పాత్రలో
ఇక రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ యంగ్ అల్లూరి సీతా రామరాజుగా ఎలా ఉంటాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. రాంచరణ్ గాయపడడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొన్నిరోజుల పాటు వాయిదా పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











