యూత్ ఐకాన్ అవార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఏసియా విజన్ మూవీ అవార్డ్స్-2015 లో పబ్లిక్ ఓటింగ్ ద్వారా జరిగిన ఈ పోటీల్లో రామ్ చరణ్ యూత్ ఐకాన్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ నెల 18న షార్జాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరో వైపు రామ్ చరణ్ తాజా మూవీ 'ధృవ' విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా హిట్టయితే మళ్లీ మునుపటి క్రేజ్ రామ్ చరణ్ కు వచ్చినట్లే అని చెబుతున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications