రామ్ చరణ్ హీరోయిన్ కి బాలీవుడ్ ఆఫర్
రామ్ చరణ్ తేజని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన చిరుత చిత్రం లోని హీరోయిన్ నేహాశర్మకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. సీరియల్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ సరసన ఆమె బుక్కయింది. ఈ చిత్రం టైటిల్ క్రూక్. ఈ చిత్రానికి దర్శకుడు హీరోయిన్స్ గ్లామర్ ని తెరపై పండించే మోహిత్ సూరి. ఇక చిరుత తర్వాత నేహాశర్మ చిన్నా చితకా ఆఫర్స్ ని లెక్కచేయలేదు. వరుణ్ సందేశ్ సరసన పొల్లాదవాన్ రీమేక్ గా వచ్చిన కుర్రాడులో మాత్రమే చేసింది. అయితే ఆ చిత్రం భాక్సా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కూడా తెలుగులో ఏమీ ఒప్పుకోలేదు. పెద్ద ఆఫర్స్ కోసం ట్రై చేసి బాలీవుడ్ లో ఆఫర్ దక్కించుకుంది. ఈ చిత్రంతో ఆమె నిలబడి వరస ఆఫర్స్ దక్కించుకుంటుందని ఆశిద్దాం.
నేహా శర్మ రామ్ చరణ్ తేజ్ చిరుత పూరీ జగన్నాధ్ వరుణ్ సందేశ్ పొల్లాదవాన్ కుర్రాడు ఇమ్రాన్ హష్మీ neha sharma ram charan teja chiruta puri jagannath kurradu imran hasmi


Click it and Unblock the Notifications