వచ్చే శుక్రవారం కోలకత్తాలో రామ్ చరణ్
జంజీర్ షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లిన రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ వినాయిక్ షూటింగ్ కోసం రామ్ చరణ్ వచ్చే శుక్రవారం కలకత్తాకు బయిలుదేరనున్నారు. జూలై 20 నుంచి అక్కడ షూటింగ్ మొదలుకానుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రామ్ చరణ్ ముద్దు పేరైన చెర్రీ ని టైటిల్ గా ఈ సినిమా కి పెట్టే ఆలోచనలో ఉన్నారు.
గతంలోనూ అల్లు అర్జున్ ముద్దు పేరు అయిన బన్నిని సినిమాకి పెట్టి సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఈ సారి అదే సెంటిమెంట్ తో అదే రూట్ లో వెళ్తున్నట్లుగా చెప్తున్నారు. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవలుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వాలైంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ క్రిందటి నెలలో వివాహానికి ముందు రెగ్యులర్ గా జరిగింది. అక్కడ రామ్ చరణ్ మీద ఫైట్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాచో లుక్ తో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని వినాయిక్ చెప్తున్నారు.
ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నిలబడిపోయే చిత్రమని అంటున్నారు. ఆకుల శివ కధ అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే కుమారుడుగా కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ చిత్రం కాక జంజీర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వినాయిక్.. అల్లు అర్జున్ తో చేసిన బద్రీనాధ్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











