ఆ గండం తొలగాలనే.. రామ్ చరణ్ హిమాలయాల బాట?
మెగా తనయుడు రామ్ చరణ్ తేజకు ఈ మధ్య భక్తి పారవశ్యం కాస్త ఎక్కవయినట్లే కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ జనాలు చెవులుకొరుక్కుంటున్నారు. ఇటీవలే అయ్యప్ప మాల ధరించిన చరణ్ దాదాపుగా 41 రోజుల పాటు నిష్టగా అయ్యప్పను పూజించి ఇటీవల శబరిమలైని దర్శించుకుని వచ్చాడు. అటు వెళ్లి వచ్చిందే ఆలస్యం మరో భక్తి యాత్రకు సిద్ధం అవుతున్నాడట చెర్రీ. త్వరలో చరణ్ హిమాలయాల సమీపంలోని ధర్మశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
భౌద్ధుల మత గురువైన దలైలామ ఆశ్రమం ఉన్న ప్రాంతమే ధర్మశాల. చరణ్ ఇక్కడకు వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకోన్నట్లు తెలుస్తూంది. తర్వలో తన పెళ్లి జరుగనున్న నేపథ్యంలో చరణ్ ఈ యాత్ర చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ లో భక్తి రసం పొంగి పొర్లడం వెనక మరో కారణం కూడా వినిపిస్తోంది. ఆ మధ్య ఓ ఆస్ట్రేలియన్ జ్యోతిష్యుడు చరణ్ గురించి ఓ విషయం బయట పెట్టారు.
ఆ విషయం ఏమిటంటే....రామ్ చరణ్ సినిమా కెరియర్లో మంచి పొజిషన్ కు వెళతాడు కానీ...సంసార జీవితంలో అతనికి మశ్శాంతి ఉండదని అని. ఈ కారణంగానే రామ్ చరణ్ గుళ్లు గోపురాలు, పూజలు అంటూ తిరుగుతున్నాడని చర్చించుకుంటున్నారు.
ఎవరి నమ్మకాలు వాళ్లవి...మనకెందకుగానీ, మన మగధీరుడి సినీకెరియర్, సంసార జీవితం సాపీగా సాగాలని ఆశిద్దాం..


Click it and Unblock the Notifications











