కాన్స్ నుండి...స్విట్జర్లాండ్ వెలుతున్న రామ్ చరణ్
కాన్స్ నుంచి రామ్ చరణ్ నేరుగా స్విట్జర్లాండ్ వెళ్ల బోతున్నారు. అక్కడ 'ఎవడు' చిత్రం షూటింగులోపాల్గొనబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ స్విట్జర్లాండులో జరిపేందుకు ప్లాన్ చేసారు. ఈ పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. స్విట్జర్లాండ్‌లో ఈ ఇద్దరిపై పలు డ్యూయెట్ సాంగులు చిత్రీకరించనున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈచిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది. దీని తర్వాత మిర్చి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు చరణ్.


Click it and Unblock the Notifications












