twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌ టాలెంటుకు ఫిదా!, మరో 10 ఆఫర్లు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'జంజీర్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. జంజీర్ చిత్రం విడుదల కాకముందే రామ్ చరణ్‌కు మరో 10 బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని జంజీర్ దర్శకుడు అపూర్వ లఖియా వెల్లడించారు.

    రామ్ చరణ్‌తో సినిమాలు చేయడానికి పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ముందుకు రావడానికి కారణం అతడు మినిమమ్ గ్యారంటీ హీరో అనే నమ్మకం వారిలో కలుగడమే అనే వాదన వినిపిస్తోంది. రామ్ చరణ్‌ సినిమాలకు సౌత్‌లో కనీసం దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. బాలీవుడ్, సౌత్ కలెక్షన్లు కలుపుకుంటే భారీ లాభాలు రాబట్టుకోవచ్చని వారు భావిస్తున్నారు.

    జంజీర్ చిత్రం విషయానికొస్తే...రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

    ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది.

    English summary
    ‘Zanjeer’ director Apporva Lakhia said that Ram Charan got ten projects offers from Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X