మెరుపు ఆలస్యంతో బాలీవుడ్ దృష్టిలో పడ్డ రామ్ చరణ్ తేజ్...!?
రామ్ చరణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మెరుపు" చిత్రానికి మొదట్నీంచీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఎన్నో కారణాల వల్ల ప్రాజెక్ట్ బాగా డిలే అవడంతో చిర్రెత్తిన కాజల్ మధ్యలోనే తప్పుకుంది. ఆమెను బ్రతిమాలి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ వర్కవుట్ కాలేదు. స్టోరీలో వున్నన్నిట్విస్టులు ఈ సినిమాకి జరుగుతున్నాయి. అలాంటిదే మరో మలుపు ఈ సినిమాకి జరగబోతోందని సమాచారం.
ఆల్రెడీ కాజల్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిర్మాతలు డైరెక్టర్ ధరణిని బయటికి పంపే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సగం పాటకే షూటింగ్ జరిగింది. ఆ సగం పాటకే 3కోట్లు ఖర్చయిందట. ఇలా అయితే సినిమా పూర్తయ్యే సరికి ఎంత బడ్జెట్ అవుతుందోనని ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్న నిర్మాతలు ధరణికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. దాంతో షూటింగ్ మరింత డిలే అవుతూ వస్తూవుంది.
కాగా'మెరుపు' సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో దొరికిన హాలిడేని హీరో రామ్ చరణ్ హ్యాపీగా గడుపుతున్నాడు. మేరేజులు, ఫంక్షన్లు, పార్టీలకు అటెండ్ అవుతున్నాడు. అలాగే నిన్న ముంబయ్ లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యాడు. ఆమిర్ మేనల్లుడు, బాలీవుడ్ హీరో అయిన ఇమ్రాన్ ఖాన్ వివాహం ఇటీవలే జరిగింది.
ఆ మేరేజ్ రిసెప్షన్ మొన్న (ఫిబ్రవరి 5) రాత్రి ముంబై, బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ లో గ్రేండ్ గా జరిగింది. ఈ వేడుకకి కేవలం 150 మంది ప్రముఖుల్ని మాత్రమే ఆహ్వానించారు. అలా ఆహ్వానం అందుకున్న చరణ్ ఈ రిసెప్షన్ కి హాజరై బాలీవుడ్ దృష్టిలో పడ్డాడు. 'చాలా లవ్లీ ఈవెనింగ్... గ్రేట్ పర్సన్ అయినప్పటికీ ఆమిర్ ఎంతో సింపుల్ గా వున్నాడు. అతని సింప్లిసిటీ నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో వుంది"అంటూ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.


Click it and Unblock the Notifications











