twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్ను నొప్పి బాధిస్తోంది, మీ సంకల్పం వల్లే వచ్చా: రామ్ చరణ్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విశాఖ జిల్లా అవంతి కళాశాలలో సందడి చేసారు. అవంతి విద్యా సంస్థలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజుల పాటు యువజనోత్సవాలు నిర్వహించారు.

    By Bojja Kumar
    |

    విశాఖపట్నం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విశాఖ జిల్లా అవంతి కళాశాలలో సందడి చేసారు. అవంతి విద్యా సంస్థలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజుల పాటు యువజనోత్సవాలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవాలకు రామ్ చరణ్ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ....మెగా ఫ్యామిలీతో ఎన్నో ఏళ్ల నుంచి 'అవంతి' అనుబంధం కలిగి ఉందన్నారు. తాను ఏ వేడుకలకు వెళ్లకపోయినా యువతకు సంబంధించిన వేడుకలకు తప్పకుండా వెళతాను, ఎవరూ చూపించనంత ప్రేమ, ఆప్యాయతలను యువత తమ కుటుంబంపై చూపిస్తోందన్నారు రామ్ చరణ్.

     వెన్నునొప్పి బాధిస్తున్నా

    వెన్నునొప్పి బాధిస్తున్నా

    కొంతకాలంగా నన్ను వెన్నునొప్పి బాధిస్తోంది. అయినప్పటికీ మీ సంకల్పం వల్లే ఇక్కడి వరకు వచ్చానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అభిమానులే తమ కుటుంబానికి అండ అని, వారి వల్లే తాము ఈ స్థాయికి వచ్చామని తెలిపారు.

    మా కుటుంబానికి విజయానందాలు

    మా కుటుంబానికి విజయానందాలు

    ‘కాటమరాయుడు' ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందని, సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుందన్నారు. గత ఏడాది ధృవ, ఈ ఏడాది ఆరంభంలో ఖైదీ 150, ఉగాదికి ‘కాటమరాయుడు'తో తమ కుటుంబానికి విజయానందాలను అభిమానులు అందిస్తున్నారని రామ్ చరణ్ తెలిపారు.

    నా దేవుడు మెగాస్టార్‌ చిరంజీవి

    నా దేవుడు మెగాస్టార్‌ చిరంజీవి

    అవంతి విద్యా సంస్థల అధిపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘నా దేవుడు మెగాస్టార్‌ చిరంజీవి' ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చి శాససభ్యున్ని చేస్తే, గత ఎన్నికల్లో పవర్‌స్టార్‌ పవన కళ్యాణ్ అనకాపల్లిలో ప్రచారం నిర్వహించి ఎంపీని చేశారన్నారు.

    పులి కడుపున పులే పుడుతుంది

    పులి కడుపున పులే పుడుతుంది

    పులి కడుపున పులే పుడుతుందనడానికి రామ్‌చరణే నిదర్శనమన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో రాణిస్తూనే, తండ్రిని సినిమాల్లోకి తీసుకురావడమే కాకుండా అఖండ విజయాన్ని అందించారని, ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటే ఎలా ఉంటుందో చూపించారన్నారు.

    రామ్ చరణ్ ప్రీ బర్త్ డే బాష్

    రామ్ చరణ్ ప్రీ బర్త్ డే బాష్

    ఈ నెలలో (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అంతకంటే ముందుగానే ప్రీ బర్త్ డే బాష్ నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో భారీ కేక్‌ను కట్‌ చేశారు.

     రామ్ చరణ్ స్టూడెంట్ ఫోరమ్

    రామ్ చరణ్ స్టూడెంట్ ఫోరమ్

    ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ స్టూడెంట్‌ ఫోరమ్‌ ప్రారంభమైంది. ఈ స్టూడెంట్ ఫోరమ్ రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

    English summary
    "Had an incredible time at Avanthi Institute of Engineering and Technology last night. Felt the energies in the air amongst you students! A Special thanks to each and everyone who had come all the way to the airport just to greet me. Thank You for a warm reception Vizag! " Ram charan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X