రాంచరణ్ అంటే ఇది.. సిబ్బంది కోసం, ఇలాంటి పని ఎంతమంది చేస్తారు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాంచరణ్ తన అజార్బైజాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ సైరా నిర్మాణపనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి పనిచేస్తున్న సిబ్బంది విషయంలో రాంచరణ్ చేసిన పనికి అభినందనలు దక్కుతున్నాయి.
Recommended Video


బోయపాటి చిత్రంలో
రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భారీ స్థాయి యాక్షన్ అంశాలతో ఉంటుంది. అయినా కూడా బోయపాటి వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయని సమాచారం.

నిర్మాతగా
రాంచరణ్ హీరోగానే కాదు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి హీరోగా కూడా భాద్యతలు నిర్వహిస్తున్నాడు. సైరా చిత్రంలో అభిమానుల్లో కనీవినీఎరుగని అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

జార్జియాలో బిజీగా
ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం జార్జియాలో భారీ షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ నిర్మాణ పనులు చోసుకుంటున్నాడు. ఈ షెడ్యూల్ కోసమే దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్భుతమైన విజువల్స్ తో యుద్ధ సన్నివేశాన్ని కళ్ళు చెదిరేలా దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ అంటే ఇది
రాంచరణ్ తన వ్యక్తిత్వాన్ని, వెన్నలాంటి మనసుని చాటుకున్నాడు. షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సైరా చిత్ర సిబ్బంది కోసం అరుదైన పని చేశాడు. సైరా చిత్రానికి పనిచేస్తున్న సిబ్బంది అందరికి రాంచరణ్ షాపింగ్ కోసం కొంత మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది.

అసిస్టెంట్స్‌ని పంపి
తన అసిస్టెంట్స్ ని పంపి సైరా సిబ్బంది చేత జార్జియాలో షాపింగ్ చేయించాడట. భారీ షెడ్యూల్ తో స్టాఫ్ తీరిక లేకుండా గడుపుతున్నారని, వారి కోసం ఏదైనా చేయాలని భావించిన రాంచరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తప్పు జరిగినా
రాంచరణ్ ని సిబ్బంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెట్ లో ఏదైనా పొరపాటు జరిగినా కూడా రవ్వంత కోపం కూడా ప్రదర్శించడం లేదని, అందరితో ప్రేమగా ఉంటున్నాడని ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











