రామ్ చరణ్ సెక్స్ అప్పీల్‌పైనే నమ్మకం!
ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ బాలీవుడ్లో నిలదొక్కుకుంటాడా? ఇప్పటి వరకు అసలు చరణ్ మొహం బాలీవుడ్ కు పెద్దగా పరిచయమే లేదు. ఈ నేపథ్యంలో కేవలం సౌత్ లో మాత్రమే ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమా ఎలా తీస్తున్నారు? ఈ ప్రాజెక్టును చేపట్టడం వెనక దర్శక నిర్మాతల్లో ఉన్న ధైర్యం ఏమిటి? ఇలా అనేక సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
పై సందేహాలకు దర్శకుడు అపూర్వ లఖియా సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో దర్శకుడు మాట్లాడుతూ.... రామ్ చరణ్ కు తప్పకుండా బాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రామ్ చరణ్ సెక్స్ అప్పీల్, పెర్ఫార్మెన్స్ టాలెంట్ వల్లనే తెలుగులో అనతి కాలంలోనే నిలదొక్కుకోగలిగాడు. బాలీవుడ్ లేడీస్ కూడా రామ్ చరణ్ సెక్స్ అప్పీల్‌కు ఫిదా అపోతారని నేను నమ్ముతున్నాను అన్నారు.
రామ్ చరణ్ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడంపై మాట్లాడుతూ.... ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకే విడుదల చేస్తున్నాము. బాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ చరణ్ పరిచయం లేదు కాబట్టి ఈ చిత్రంలో సంజయ్ దత్, అతుల్ కులకర్ణి, మహి గిల్ లాంటి నటులను తీసుకున్నాం. దీని వల్ల భారం మొత్తం రామ్ చరణ్ పైనే పడదు. భారీ తారగణం ద్వారా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమా హిట్టయితే రామ్ చరణ్ కు బాలీవుడ్లో తిరుగు ఉండదు అని చెప్పుకొచ్చాడు దర్శకుడు.
సినిమా విశేషాల్లోకి వెళితే...
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











