హిమాలయాల బాట పట్టిన రామ్ చరణ్ తేజ్...!
రామ్ చరణ్ పెళ్ళి కి ముందు ఆధ్యాత్మిక యాత్రలు చేయడంలో బిజీగా ఉన్నాడు. ఒక పక్క రచ్చ షూటింగ్ లో పాల్గొంటూనే మరో పక్క దైవ యాత్రలు చేస్తున్నారు. ఇటీవలే అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన రామ్ చరణ్ ఈ మధ్యే హిమాలయాలకు పయనమయ్యారు. ప్రముఖ బౌద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మశాలలో ప్రార్ధన తరువాత, రామ్ చరణ్ 4500 అడుగులు ఎత్తులో ఉన్న మంచు కొండలు ఎక్కే పనిలో ఉన్నారు.
హాయిగా అందమయిన భామలతో సినిమాలు చేసుకొంటున్న కుర్రాడు రామ్ చరణ్ కి ఇంత హట్టాత్తుగా వైరాగ్యం ఎందుకోచ్చేసింది? అయినా ఈ వయసులో వైరాగ్యం వచ్చేసే అంత సమస్యలు అతనకి ఏముంటాయి? పాపం! అని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు
క్రీడలలో మంచి అభిరుచి ఉన్న రామ్ చరణ్ తేజ్ గుర్రపు స్వారి, దానితో పాటు పోలో ఆట ఆడటం, సినిమాల పేరు చెప్పుకొని బంగీ జంపులు చేయడం, ప్యారాచూట్ కట్టుకొని విమానాల్లోంచి దూకడం వంటి సాహస క్రీడలు చాలానే చేసాడని మనకి తెలుసు. ఇప్పుడు, తన చిరకాల వాంఛ అయిన హిమాలయాలని అధిరోహించడం కూడా చేసేసాడు. దాదాపు 4500 అడుగుల ఎత్తున తీయించుకొన్న ఈ ఫోటోని ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇటువంటి ఉత్సాహవంతులయిన కుర్రాళ్ళే నేడు మన దేశానికి, సినిమాలకి కూడా చాలా అవసరం.


Click it and Unblock the Notifications











