అందుకేనా? చరణ్ కోసం బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ సమీర్ జౌరాను హైర్ చేసుకుంటున్నారు. జులై చివరి వారం నుండి నాలుగైదు నెలల పాటు అతని సమక్షంలో రామ్ చరణ్ ఫిట్ నెస్ శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది. త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం న్యూ లుక్‌తో కనిపించడానికి రామ్ చరణ్ సమీర్ జౌరాను హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సమీర్ జౌరా ముంబైకి చెందిన ఫిట్ నెస్ ట్రైనర్. హృతిక్ రోషన్, ఫరాన్ అక్తర్, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ టాప్ స్టార్లకు ఆయన ఫిట్ నెస్ శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే సమీర్ జౌరా హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. శిక్షణ కాలంలో రామ్ చరణ్ ప్రత్యేకమైన డైట్ తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు.
గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకీ పార్టు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











