రామ్ చరణ్ మరోసారి ‘సున్నా’
చిరు తనయుడు రామ్ చరణ్ తేజ మరోసారి...గుండు సున్నా పెట్టాడు. 2011 చరణ్ నటించిన ఒక్కటంటే..ఒక్క సినిమాకూ విడుదల కాలేదు. విడుదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ నాటికి గానీ విడుదలయ్యే అవకాశాల లేవు. గతంలో మగధీర తర్వాత విజయోత్సాహంలో చాలా రోజులు గ్యాప్ తీసుకున్న చెర్రీ...ఆరెంజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి చతికిల పడ్డాడు. ఆరెంజ్ ప్లాయింది కదా...అంతకంటే మంచి సినిమా తీద్దామనే ఆలోచనతో ఈ ఆలస్యం చేస్తున్నాడనుకుంటే పొరపాటే. ఈ ఆలస్యానికి కారణం చరణ్ అసలు విషయంపై అశ్రద్ధ పెట్టి, కొనసరు విషయంపై అమితాసక్తి చూపించడమే.
ఈ మధ్య పోలో టీం, ఇతర వ్యవహారాలతో బిజీగా గడుపుతున్న చరణ్.....ఎప్పుడో తనకు ఖాళీ సమయం చిక్కినప్పుడు మాత్రమే రచ్చ షూటింగులో పాల్గొంటున్నాడట. అందుకే సినిమా ఆలస్యం అవుతుందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇలా అయితే చరణ్ చాలా నష్టపోక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. వృత్తి మీద నిబద్దత తగ్గితే సినీ కెరీర్ సున్నా అవుతుందని హెచ్చరిస్తున్నారు. చిరంజీవి సీరియస్ వర్కర్ కాబట్టే ఆ స్థాయి ఎదిగాడు, మరి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చరణ్ ను ఇలా గాలి వదిలేస్తున్నాడేమిటి? అని గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











