»   » నా గుర్రం పేరు కాజల్...రామ్ చరణ్ తేజ

నా గుర్రం పేరు కాజల్...రామ్ చరణ్ తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా దగ్గరున్న గుర్రం పేరు కాజల్. అయితే దీనిని మీరు మరోలా అపార్ధం చేసుకోకండి. నేనా గుర్రాన్ని కొనేనాటికే ఆ గుర్రం పేరు కాజల్. అప్పటికి కాజల్ ‌తో కనీసం నాకు పరిచయం కూడా లేదు అంటూ తనకున్న హాబీలలో హార్స్ రైడింగ్ ఒకటని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. అలాగే తన మరో గుర్రం పేరు బాద్‌ షా అన్నారు. ఈ విషయం వివరిస్తూ.."మగధీర"లో మీరు చూసే గుర్రం నా స్వంత గుర్రమే. మొన్నటి వరకూ రెండు గుర్రాలే ఉండేవి. ఈ మధ్య మరో రెండు గుర్రాలు కొన్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూర్తి చేసిన ఆరెంజ్ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అలాగే రామ్ చరణ్ తదుపరి చిత్రం మెరుపు ఆల్రెడీ షూటింగ్ లో ఉంది. రామ్ చరణ్ సరసన కాజల్ మొదటిసారిగా మగధీర చిత్రంలో చేసింది. ఇప్పుడు మెరుపులోనూ మెరవనుంది. మెరుపు చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో బంగారం వంటి ప్లాప్ చిత్రం డైరక్ట్ చేసిన ధరణి రూపొందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu