‘మగధీర’ లో కాజల్ పైకెక్కి రామ్ చరణ్ స్వారీ చేశాడా!
'మగదీర" చిత్రంలో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు అశ్యమేదం కూడా రామ్ చరణ్ కు బాగా సహకరించింది. ఈ చిత్రంలో హార్స్ రైడింగ్ కి ఉన్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే కాబోలు 'మగధీర" చిత్రం అంత సెన్సేషనల్ హిట్ ను సాదిస్తోంది. 'కాజల్" హీరోయిన్ అనుకుంటే పొరపాటే, రామ్ చరణ్ సొంతగా పెంచుకొన్న గుఱ్ఱం పేరు 'కాజల్". రామ్ చరణ్ కి చిన్నప్పటి నుండి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టంమట. హార్స్ రైడింగ్ కష్టమైనా ఇష్టంగా నేర్చుకొన్నారు కాబట్టే ఈ సినిమాలో రామ్ కు చాన్స్ రావడం, సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం జరింగింది.
'మగధీర" చిత్రం గురించి చర్చించవలసి వస్తే అందులో నటించిన హీరోహీరోయిన్ల పేర్లు కాకుండా కాలభైరవ, మిత్రవింద పాత్రలే ఎక్కువగా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అంతగా ఆ పాత్రల్లో లీనమై నటిచడంతో పాటు, రామ్ చరణ్ తన సొంత గుర్రాన్నే ఇందులో ఉపయోగించుకొన్నాడు. బ్లాక్ కలర్ లో వున్న ఆ గుఱ్ఱం పేరు కూడా 'కాజల్" అట. గుఱ్ఱం పేరు, హీరోయిన్ పేరు ఒకటే కావడం విశేషం. మొత్తానికి 'కాజల్" పేరు రామ్ చరణ్ కి బాగా కలిసొచ్చినట్టుంది కాబోలు.


Click it and Unblock the Notifications











