Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఆ దారి మూసుకుపోలేదు.. ఆ సినిమా పెద్ద షాకిచ్చింది.. రాంచరణ్
Recommended Video
రంగస్థలం చిత్ర విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ చిత్రాల్లో నటించే విషయంపై క్లారిటీతోపాటు పలు అంశాలను ఆయన వెల్లడించారు.
జంజీర్‌తో తీవ్ర నిరాశ
జంజీర్ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాను. ఆ చిత్రం నాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హిందీలో జంజీర్ నా ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకొన్నారు. దాంతో ప్రేక్షకుల కొంత నిరాశకు గురయ్యారు అని రాంచరణ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ దారులు మూసుకుపోలేదు
జంజీర్ ఫ్లాప్ అయినంత మాత్రన నా బాలీవుడ్ దారులు మూసుకుపోలేదు. మంచి కథ దొరికితే మళ్లీ హిందీ చిత్రాల్లో నటిస్తాను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని రాంచరణ్ అన్నారు.
ప్రియాంకతో మళ్లీ నటిస్తా
జంజీర్లో తన పక్కన హీరోయిన్గా నటించిన ప్రియాంక చోప్రాపై రాంచరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక చోప్రా అద్బుతమైన నటి. అకింతభావంతో పనిచేసే పక్కా ప్రొఫెషనల్. ఆమెతో పనిచేయడం గొప్ప అనుభూతి. మళ్లీ అవకాశం లభిస్తే ఆమెతో పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని రాంచరణ్ తెలిపారు.
హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ స్పందన
హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనే కోరిక లేదు. తెలుగులో నాకు లభిస్తున్న పాత్రల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. గొప్పగా కెరీర్ ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడమే నా ముందున్న లక్ష్యం. సినిమాలు విజయం సాధించాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి చిత్రాల్లో నటిస్తాను అని రాంచరణ్ పేర్కొన్నారు.