అమ్మ కన్నీళ్లు.. బాబాయ్ ప్రశంసను మరిచిపోలేను.. రాంచరణ్

By Rajababu

కలెక్షన్లపరంగా, రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్న నేపథ్యంలో రంగస్థలం సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

Recommended Video

Rangasthalam Success Meet : Pawan Kalyan Emotional Speech
 అమ్మ కళ్లనీళ్లు..

అమ్మ కళ్లనీళ్లు..

రంగస్థలం సక్సెస్ మీట్‌కు హాజరైన ప్రతీ ఒక్కరికీ, ప్రధానంగా మా బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. ఈ సినిమా చూసిన తర్వాత ముగ్గురు వ్యక్తుల రియాక్షన్ మరిచిపోలేను. సినిమా చూసిన తర్వాత మా అమ్మ కళ్ల నీళ్లు పెట్టుకొన్నది. కాసేపు పక్కనే కూర్కొన్నది. ఆ క్షణాలు మరిచిపోలేనివి.

 థియేటర్‌లో చూస్తానని చెప్పారు

థియేటర్‌లో చూస్తానని చెప్పారు

రంగస్థలం సినిమా సక్సెస్ తర్వాత పవన్ కల్యాణ్ ఒకరోజు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. బాబాయ్ ఇంటికి వెళ్లిన తర్వాత సినిమా బాగున్నదని కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత సినిమా చూడలేదని తెలిసింది. దాంతో సినిమా చూస్తే ఇంట్లో షో ఏర్పాటు చేస్తానని చెబితే కాదన్నారు. ప్రివ్యూ థియేటర్ల ఏర్పాటు చేస్తానంటే కూడా వద్దన్నారు. థియేటర్లలో చూద్దామన్నారు. జనం మధ్య కూర్చొని చూడాలని ఉందని చెప్పారు.

 పవన్ కల్యాణ్‌తో చూడటం

పవన్ కల్యాణ్‌తో చూడటం

బాబాయ్‌తో కలిసి ప్రసాద్ ఐమాక్స్‌లో కలిసి చూశాను. ఆయనతో కలిసి చూడటమనేది మధురమైన అనుభవం. తొలిప్రేమ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ రంగస్థలం సినిమాను చూశారు. అనంతరం బాబాయ్ ప్రశంసలు మరిచిపోలేను. రంగస్థలం సినిమా విషయంలో అమ్మ, బాబాయ్ రియాక్షన్ మర్చిపోలేను. అందుకు థ్యాంక్స్. నా జీవితంలో అద్భుతమైన సినిమాను ఇచ్చిన సుకుమార్‌కు మరోసారి థ్యాంక్స్.

 పవన్ ముందు ఎక్కువగా మాట్లాడలేను

పవన్ ముందు ఎక్కువగా మాట్లాడలేను

పవన్ కల్యాణ్ ముందు కూర్చొంటే నేను ఎక్కువగా మాట్లాడలేను. ఆయన వేదికపైకి వస్తే అభిమానులందరికీ ఆనందంగా ఉంటుంది. రంగస్థలం సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మైత్రీమూవీస్ అధినేతలు నవీన్, రవి, మోహన్‌ చాలా చాలా థ్యాంక్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X