Akhil: ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్? టీజర్‌తో సడెన్ సర్‌ప్రైజ్.. సెన్సేషన్ అవుతున్న వీడియో!
టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి హీరోగా తెరంగేట్రం చేశాడు అఖిల్. సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రజల మనసు దోచుకున్న అఖిల్ మనం మూవీలో కెమియోతో అదరగొట్టాడు. తర్వాత అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా విజయం వరించలేదు. ఇప్పుడు తాజాగా సాలిడ్ హిట్ కొట్టేందుకు ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సినిమా ఒక్క రోజు రిలీజ్ కు ముందు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మూవీ మేకర్స్.
స్టైలిష్ యాక్షన్:అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం ఆకట్టుకుంది. అయితే సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. దీంతో స్టార్ డమ్ తెచ్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు అఖిల్. ఈ క్రమంలోనే స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వలో ఏజెంట్ సినిమా చేశాడు.

పాన్ ఇండియాగా:ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిచాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య అలరించనుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నారు.
అలాంటి సాహసం:ఏజెంట్ సినిమా కోసం అఖిల్ విపరీతంగా కష్టపడినట్లు అతని సిక్స్ ప్యాక్ బాడీ చూస్తూనే తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ తరహాలో తెరకెక్కించిన ఏజెంట్ మూవీపై అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం 172 ఫీట్ల భవనంపై నుంచి దూకి ఎవరూ చేయలేని సాహసం చేసి చూపించాడు అఖిల్.

ఒక్క రోజే:ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మూవీపై హైప్ పెంచారు. ఇప్పటికీ విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ అయితే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఏజెంట్ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మూవీ గురించి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
మరింత క్యూరియాసిటీ:అఖిల్ ఏజెంట్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం తాజాగా మేకర్స్ వదిలిన టీజరే. ఈ టీజర్ లో వెనుక నుంచి రామ్ చరణ్ కనిపించి షాక్ ఇచ్చాడు. ఈ టీజర్ ఎండింగ్ లో 'ఏజెంట్ ఎక్కడున్నావ్' అని రామ్ చరణ్ పలకడం మరింత క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది.

రెండింటింకి లింక్:అయితే ఏజెంట్ తాజా టీజర్ ను వదిలిన మూవీ మేకర్స్ "థింగ్స్ ఆర్ గెట్టింగ్ వైల్డర్ ధ్రువ x ఏజెంట్" అని రాసుకొచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు కలిపి ఏదైనా లింక్ చేశారా అని పలువురు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏజెంట్ సినిమాలో చెర్రీ కనిపిస్తాడా అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో అఖిల్, రామ్ చరణ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో కట్ అని మరికొందరు అంటున్నారు. వీటిలో ఎంత నిజముందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











