లారెన్స్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ?

అదే ప్రశ్నను లారెన్స్ ముందుంచితే...నీ దర్శకత్వంలో వచ్చిన 'మాస్' మంచి హిట్ కదా...'డాన్' ఢమాల్ అందేమిటి అంటే అదేం లేదు...నాగార్జనతో మాస్ మొదటి సినిమా కాబట్టి ...కమర్షయల్ అంశాలున్నాయి గాబట్టి గొప్ప హిట్టయింది. అదే డాన్ సినిమాకు కథ కన్నా కథనానికి, కమర్షయాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం...హిందీ సినిమాలాగా స్టైల్ గా తీద్దామనుకున్నాం తీసాం. అలాగే మేం ఊహించినట్లుగానే బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ లభించింది. అంతే కాదు..హిందీలోకి అనువదించాం ...అక్కడా అద్బుతాదరణ లభించింది అంటూ వివరించాడు. అందుకే నాగార్జున తో మరో సినిమా చేయబోతున్నానని చెప్తున్నాడు. అలాగే తను సోలో హీరోగా చేసిన 'పార్ధు' ...లో టైటిల్స్ లో వచ్చే సాడ్ సాంగ్ ప్రేక్షకులకు బాగా పట్టిందని మురిసిపోతున్నాడు. కొత్త ఆఫర్స్ ,రిలీజైన సినిమాలు సంగతి ఎలా ఉన్నా హైపు కబుర్లు చెప్పటం బాగా అలవాటయ్యిందంటున్నారు ఇది విన్నవారు.


Click it and Unblock the Notifications











