twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాలు ప్లాప్, బాధతో రోజుల తరబడి బెడ్రూంలో ఉండిపోయా: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్ పతాకావిష్కరణ

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న చెరిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ విద్యార్థులను ఉద్దేశించి స్పూర్తిదాయమైన స్పీచ్ ఇచ్చారు. జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణం, తప్పులు చేయడం మానవ సహజం, ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుని సరైన దారిలో ప్రయాణించే ప్రయత్నం చేయాలి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈసందర్భంగా తన ఫెయిల్యూర్స్ గురించి ప్రస్తావించారు.

    చదువంటే పుస్తకాలు మాత్రమే కాదు

    చదువంటే పుస్తకాలు మాత్రమే కాదు

    చదువు అంటే కేవలం హోం వర్క్ పూర్తి చేయడం, పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. మన చుట్టూ ఉండే పరిస్థితులను చదవడం నేర్చుకోవాలి. కొత్త విషయాలను అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని రామ్ చరణ్ సూచించారు.

     తప్పులు చేయండి, కానీ...

    తప్పులు చేయండి, కానీ...

    జీవితంలో తప్పులు అనేవి జరుగుతాయి. తప్పు జరుగుతుందేమో అనే భయంతో ఏదైనా పని చేయడానికి భయపడొద్దు. తప్పులు చేయండి... తప్పు చేసినపుడే ఏది రైటో మీకు మీరుగా గ్రహిస్తారు అని రామ్ చరణ్ అన్నారు.

    ఆ సినిమాలు ప్లాప్ అయినపుడు

    ఆ సినిమాలు ప్లాప్ అయినపుడు

    నేను నా ఫెయిల్యూర్స్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. కెరీర్లో 11 సినిమాలు చేస్తే కొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ సమయంలో నేను నా బెడ్ రూమ్ నుండి బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదు. కొన్ని రోజుల పాటు బాధ పడుతూ రూములోనే ఉండిపోయాను. ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అన్నీ మా అమ్మ అక్కడికే తెచ్చి పెట్టేది. అలా కృంగి పోవడం తప్పు అని తర్వాత తెలుసుకున్నాను అన్నారు.

    పెద్దలు చెప్పేది వినాలి

    పెద్దలు చెప్పేది వినాలి

    మనల్ని కొందరు గైడ్ చేస్తారు, సహాయం చేస్తారు, కొత్త విషయాలు నేర్పిస్తారు. పెద్దలు చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి, వాటి ఆధారంగా మనల్ని మనం బేరీజు వేసుకోవాలి. ఫెయిల్యూర్స్ అనేది జీవితంలో ఒక భాగం. ఆ సమయంలో నువ్వు ఓడిపోయావు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అధైర్య పడకుండా ముందుకు సాగడం నేర్చుకోవాలి అన్నారు.

    తప్పించుకోవద్దు

    తప్పించుకోవద్దు

    వాస్తవాలను అంగీకరించడం నేర్చుకోవాలి. క్లిష్టమైన పరిస్థితులు ఏదురైనపుడు వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. వాటిని ఎదుర్కొంటూ ముందుకు నడవాలి. తప్పులు జరిగినపుడు మరోసారి అలాంటి చేయకుండా జాగ్రత్త పడటం నేర్చుకుంటామని రామ్ చరణ్ తెలిపారు.

    జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చరణ్

    జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చరణ్

    ఈ సందర్భంగా రామ్ చరణ్ తాను చదువుకున్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన రత్న మేడమ్ ఇంకా తదితరుల గురించి గొప్పగా చెప్పారు. విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలన్నారు.

    English summary
    Ram Charan Inspirational Speech at Chirec International School 72nd Independence Day Celebrations. Mega Powe star has reminded his association with the School and revealed some of the important events of him pertaining to the School.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X