అభిషేక్ బచ్చన్ ని కాదని రామ్ చరణ్ కి ఛాన్స్
రామ్ చరణ్ కొత్తగా కమిటైన బాలీవుడ్ చిత్రాన్ని తెలుగు,హిందీలలో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ సూపర్ హిట్ జంజీర్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మొదట అభిషేక్ బచ్చన్ తో హిందీ వెర్షన్,తెలుగుకి రామ్ చరణ్ అనుకున్నారు. అయితే రామ్ చరణ్ తనకు హిందీ వెర్షన్ లో చేయటానికి అవకాశమిస్తేనే సినిమా చేస్తాననటంతో అభిషేక్ ని కాదని రెండు భాషలకూ రామ్ చరణ్ నే తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ...అపూర్వ లఖియా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తో జంజీర్ రీమేక్ చే్స్తున్నారు. అది బై లింగ్విల్ చిత్రం.
ఓ కార్పోరేట్ సంస్ధ ఈ చిత్రానికి ఫైనాన్స్ చేయటానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రం రామ్ చరణ్ ని బాలీవుడ్ కి పరిచయం చేసే చిత్రం కాబట్టి అంటూ ఓ ఇంగ్లీష్ డైలీ రాసుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకోనిని జయ భాధురి పాత్రకోసం అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై దీపిక మేనేజర్ మాట్లాడుతూ...ఆమెకు సౌత్ సినిమాల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమె రజనీకాంత్ చిత్రం మాత్రమే ఓకే చేసింది అన్నారు. ఇక ఈ జంజీర్ రీమేక్ ఆయిల్ మాఫియా నేపధ్యంలో జరగనుంది. దాదాపు డబ్బై కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క రామ్ చరణ్ రచ్చ విడుదలకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications











