‘మగధీరు’డిని హేలన చేసిన వరుడు!
అల్లు అర్జున్ ఏం చేసినా ఈ మధ్య ఎదురుతిరుగుతుంది..ఆర్య2, వరుడు కష్టపడి చేస్తే అవి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అలాగే బన్నీకి పాకెట్ మనీగా ఉపయోగ పడుతున్న 7అఫ్ డ్రింక్ అంబాసిడర్ కూడా అతను రియాక్ట్ చేసే పరిస్థితులు ఏర్సడుతున్నాయి ఏలా అనుకుంటున్నారా? రీసెంట్ గా వస్తున్న యాడే అందుకు కారణం.
అసలు విషయం ఏమిటంటే ఆయాడ్ లో కొణెదల సింహాం రామ్ చరణ్ ని అల్లుఅర్జున్ ఓడించినట్టుగా, హేలన చేస్తున్నట్లు, బ్యాగ్రౌండ్ లో ఆర్య2 చిత్రంలోని సాంగ్ పెట్టడం, అల్లు అర్జున్ కు అపోజిట్ గా మగధీరలో రామ్ చరణ్ గెటఫ్ ను పోలిన ఒక శాల్టీ కనిపిస్తుంది. బన్నీ అందులో ఆ శాల్టీని ఏడిపిస్తూ నాలా డాన్స్ చేయడం నీవల్ల కాదు అనే విధంగా హేలన చేస్తున్నట్లు చూపిస్తున్నారు ఇదంతా మగధీర ఫ్యాన్స్ కి నచ్చడం లేదట..అక్కడక్కడా డ్రింక్ షాపులపై దాడి చేసి వారు 7అప్ సీసాలను పగులగొడుతున్నారట.
మెగా అభిమానులు ఆగ్రహం తెలియజేస్తున్న విషయం మెగా కుటుంబానికి కూడా తెలియడంతో అల్లు అర్జున్ కి చిన్నపాటి హెచ్చరికలు కూడా వెళ్లాయని సమాచారం. అయితే చిన్న యాడ్ కి జేజు నిండుతుండటంతో అల్లు అర్జున్ 7అఫ్ అంబాసిడర్ ని వదులు కోనని చెప్పడం త్వరలో యాడ్ ను మర్చడం వంటివి శరవేగంగా సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











