twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు బాబాయ్ వద్దన్నాడు, ఇప్పుడు అసలే ఆలోచించను: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    అప్పుడు బాబాయ్ వద్దన్నాడు, ఇప్పుడు అసలే ఆలోచించను: రామ్ చరణ్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో డొకొమో, పెప్సీ లాంటి బ్రాండ్లతో అసోసియేట్ అయిన ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన హ్యాప్పి మొబైల్స్ సోర్స్‌తో అసోసియేట్ అయ్యారు. ఈ సంస్థ తరుపు 18 నెలల పాటు ప్రచారం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్ ఇష్టాగోష్టిగా చర్చించారు. ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు పలు ఇతర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

     త్వరలో చారిటీ ఫౌండేషన్

    త్వరలో చారిటీ ఫౌండేషన్

    రామ్ చరణ్ త్వరలో చారిటీ ఫౌండేషన్ మొదలు పెట్టబోతున్నాడు. దీని గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా... మరో నెల రోజుల్లో ఫౌండేషన్ అనౌన్స్ చేస్తాం, ప్రస్తుతం పేరు రిజిస్టర్ చేయించే పనిలో ఉన్నాము అని రామ్ చరణ్ తెలిపారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత బాగాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకోసం ఇస్తున్నాం. ఇకపై బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా వచ్చే ఆదారంలో కొంత భాగం తన ఫౌండేషన్ కోసం కేటాయించనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

    అందుకే ఇన్ని గ్యాప్ వచ్చింది

    అందుకే ఇన్ని గ్యాప్ వచ్చింది

    డొకొమో, పెప్సీ లాంటి బ్రాండ్ల తర్వాత ఇంకో బ్రాండ్ సెలక్ట్ చేసుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు? అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.... అన్ని కుదరాలి. మైండ్ సెట్ కూడా ఒప్పుకోవాలి. వాళ్లు డబ్బులిచ్చారు, ఫోటో షూట్ చేశాం, పోస్టర్ మీద ఎక్కించాం లాంటి మెకానికల్ యాటిట్యూడ్ నాకు సెట్టవ్వదు. ఏదైనా బ్రాండుకు అసోసియేట్ అయితే దాని రూట్స్ వరకు వెళ్లాలి అనేది నా కోరిక... అని రామ్ చరణ్ తెలిపారు.

    క్రికెట్ ఫ్రాంచైజీ ఆలోచనలేదు

    క్రికెట్ ఫ్రాంచైజీ ఆలోచనలేదు

    మీరు క్రికెట్ ఫ్రాంచైజీ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.... ఇప్పటికే సచిన్ టెండూల్కర్ తో కలిసి కేరళ బ్లాస్టర్స్, తమిళ్ తలైవార్ కబడ్డీ జట్టుతో నాన్నగారు అసోసియేట్ అయి ఉన్నారు. క్రికెట్ అనే ఆలోచన మాకు ఇంకా రాలేదు అని రామ్ చరణ్ తెలిపారు.

    చాలా హ్యాపీ మూమెంట్స్

    చాలా హ్యాపీ మూమెంట్స్

    ఓ ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.... నా జీవితంలో చాలా సంతోషకరమైన మూమెంట్స్ ఉన్నాయి. నా తండ్రి నుండి ఫస్ట్ గిఫ్ట్ అందుకున్నపుడు, సెట్లోకి తొలిసారి ఎంటరైనపుడు, మగధీర లాంటి మెగా బ్లాక్ బస్టర్ వచ్చినపుడు, ఆరెంజ్ లాంటి అందమైన సినిమా చేసినపుడు.....ఇలా చాలా ఉన్నాయి. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఉపాసనతో, నా పెట్స్ తో, వర్క్ లో చాలా ఎంజాయ్ చేస్తాను అని రామ్ చరణ్ తెలిపారు.

    అపుడు బాబాయ్ వద్దన్నాడు, ఇపుడు పిలిస్తే వెళతా

    అపుడు బాబాయ్ వద్దన్నాడు, ఇపుడు పిలిస్తే వెళతా

    పొలిటికల్‌గా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ప్రజారాజ్యం సమయంలో నేను ప్రచారానికి వస్తాను అంటే నువ్వు ప్రచారానికి రావడానికి ఇంకా సమయం ఉంది, ఇప్పుడే వద్దు అని బాబాయ్ చెప్పారు. ఆయనకు మెంటల్‌గా బరోసా ఎప్పుడూ ఉంటుంది. ఆయన రమ్మని పిలుపు ఇచ్చినపుడు ఒక సెకన్ కూడా ఆలోచించకుండా వెళతాను. ఆయన నుండి పిలుపు రావాలని ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాం.... అని రామ్ చరణ్ తెలిపారు.

    అలాంటి సినిమాలు చేసే వయసు రాలేదు

    అలాంటి సినిమాలు చేసే వయసు రాలేదు

    మహేష్ బాబు ‘భరత్ అనే నేను' మాదిరిగా పొలిటికల్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ ఇపుడే మహేష్ చేశాడు కదా, మళ్లీ నేను అలాంటిదే చేస్తే బోర్ కొట్టేస్తుంది. ప్రస్తుతానికి ప్లాన్ చేయడం లేదు. నా వయసుకు అంత పెద్ద క్యారెక్టర్లు చేయగలనో లేదో నాకు తెలియదు. మహేష్ సీనియర్ యాక్టర్ కాబట్టి చాలా బాగా చేశాడు. ఎప్పుడు చేస్తానో ఇప్పుడే చెప్పలేను అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

     లేని ఫీలింగ్ తెప్పిస్తున్నామా? అనిపిస్తుంది

    లేని ఫీలింగ్ తెప్పిస్తున్నామా? అనిపిస్తుంది

    నా సినిమా పోస్టర్ల మీద కలెక్షన్ల నెంబర్స్ వేసినపుడు అనవసరంగా ప్రేక్షకుల్లో లేని ఫీలింగ్ తెప్పిస్తున్నామా? అనే ఫీలింగ్ వస్తుంది. మేమే ప్లెయిన్ గా, చాలా జెన్యూన్‌గా అనుకునేది మీరు కొన్ని సార్లు అపార్ధం కూడా అనుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన అప్పుడప్పుడూ వస్తుంది. ఇది నేను పర్సనల్‌గా ఫీలయ్యేది. భవిష్యత్తులో నాతో సినిమాలు చేసే నిర్మాతలకు నా పోస్టర్లపై కలెక్షన్ల నెంబర్లు వేయవద్దని కోరుతాను... అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    నెంబర్లకంటే అదే ముఖ్యం

    నెంబర్లకంటే అదే ముఖ్యం

    సినిమాను సినిమాగా ఉంచాలి అనేది నా కోరిక. నా సినిమా 200 కోట్లు వసూలు చేసింది అనేదానికంటే ఎంత ఎక్కువ మంది థియేటర్ కు వచ్చి చూశారు అనేది ముఖ్యం. ఎక్కడికైనా వెళ్లినపుడు ఓ పది మంది మీ సినిమా బావుంది అని చెప్పడంలో ఉన్న ఆనందం ఈ నెంబర్స్ కచ్చితంగా ఇవ్వదు. నా కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు, నేను ఇతర బేనర్లలో చేసే సినిమాల్లో ఇకపై ఇలాంటి నెంబర్లు లేకుండా చూసుకుంటాను. అందరి మధ్య మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటాను. అది నిజం అవ్వాలంటే యాక్టర్స్ గా మేము మా సినిమా పోస్టర్లపై నెంబర్లు వేయకుండా చూడటమే మార్గం అని రామ్ చరణ్ తెలిపారు.

    English summary
    “I was very excited and geared up to start campaigning during Prajarajyam but it was my uncle Pawan Kalyan who stopped me and told me ‘This is too early for you’, I wouldn’t think twice if he calls me now for his political campaigns. I will join immediately and support him in his journey,” Ram Charan said at 'Happi Mobiles' Launch event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X