twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్‌పై రాంచరణ్ కామెంట్స్.. రాజకీయాల్లో సరికొత్త తరంగం!

    |

    Recommended Video

    Ram Charan Responds On Janasena Manifesto,Made Interesting Comments On Pawan Kalyan || Filmibeat

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ లో కాలికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా మూడు వారాల పాటు వాయిదా పడింది. ఇదిలా ఉండగా రాంచరణ్ సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో అందుకు సంబంధించిన ప్రశ్నలు చరణ్ కు తరచుగా ఎదురవుతున్నాయి. తాజాగా రాంచరణ్ సోషల్ మీడియాలో జనసేన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

     సమాజంలో ప్రతి ఒక్కరికి

    సమాజంలో ప్రతి ఒక్కరికి

    రాంచరణ్ తన పేస్ బుక్ పేజీలో జనసేన పార్టీ మేనిఫెస్టోపై స్పందించాడు. అద్భుతమైన మేనిఫెస్టో. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఇది సరికొత్త తరంగం. కళ్యాణ్ బాబాయికి కంగ్రాట్స్. జనసేన పార్టీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు అంటూ రాంచరణ్ పేర్కొన్నాడు. జనసేన పార్టీని ఉద్దేశిస్తూ రాంచరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     మెగా హీరోల ప్రచారం

    మెగా హీరోల ప్రచారం

    జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ సోదరుడు నాగబాబు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నాగబాబుకు పవన్ నరసాపురం లోక్ సభ స్థానాన్ని కేటాయించారు. ఇక ఎన్నికల ప్రచారంలో మెగా ఫ్యామిలిలోని ఇతర హీరోలు పాల్గొంటారా లేదా అనే చర్చ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక ఎన్నికల ప్రచారంలో నాగబాబుతో కలసి కనిపించింది.

    రాంచరణ్ తరచుగా

    రాంచరణ్ తరచుగా

    రాంచరణ్ సంధర్భం వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. బాబాయి కోరుకుంటే ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధం అని గతంలో రాంచరణ్ తెలిపాడు. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ చిన్న గ్లాసు భవిష్యత్తులో పెద్ద సంచలనంగా మారబోతోంది అంటూ అభిమానులని ఉత్తేజపరిచారు. తాజాగా ఎన్నికలకు ముందు జనసేన మేనిఫెస్టో గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది.

     అల్లూరి పాత్రలో

    అల్లూరి పాత్రలో

    ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ జోరుగా జరుగుతున్న సమయంలో బ్రేక్ పడింది. రాంచరణ్ అనుకోని విధంగా గాయానికి గురయ్యాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

    English summary
    Ram Charan interesting comments on Pawan Kalyan and Janasena Party. Excellent manifesto giving priority to all sectors of the society. A new wave in politics says Charan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X