యాంగ్రీ బర్డ్స్‌కు బానిసగా మారిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాంగ్రీ బర్డ్స్ అనే ఐపాడ్ గేమ్‌కి అడిక్ట్ అయ్యాడు. ఈ విషయాన్నీ రామ్ చరణ్ తన ట్విట్టర్లో స్వయంగా పేర్కొన్నాడు. షూటింగ్ సమయంలోనూ ఆ గేమ్ ఆడకుండా ఉండలేక పోతున్నానని, చిన్న గ్యాప్ దొరికినా మనసంతా ఆ ఆటవైపు లాగేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ గేమ్ గురించి తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ఆడే ఈ గేమ్ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవు మంది ఆడే గేమ్స్ లో ఒకటి.
ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ'సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోయే 'ఎవడు'చిత్రం రెగ్యులర్ షూటింగుల్లో పాల్గొన బోతున్నాడు.
మరో వైపు అమితాబ్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జంజీర్' రీమేక్ ద్వారా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రకాష్ మెహ్రా తనయుడు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఇందులో నటించడానికి రామ్‌చరణ్ తన అంగీకారం తెలిపాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











