ధోని ఆపద్బాందవుడిలా ప్రక్కన ఉండగా రామ్ చరణ్ కేల చింత!
పెప్సీ శీతల పానీయానికి అంబాసిడర్ గా రామ్ చరణ్ ఉన్నాడనే క్రమంలో వేర్సీటు వాదులు..కొన్ని రోజుల క్రితం షాపులపై దాడిచేసి పెప్సీ బాటిళ్లను పగులకొట్టిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ధనాధన్ తో కలిసి రామ్ చరణ్ మళ్లీ కనిపించనున్న తరుణంలో ఈసారి వేర్సాటు వాదులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో. బాలీవుడ్ భామ దీపికా పదుకునెతో కలిసి డాన్స్ లు చేసిన రామ్ చరణ్ ఇప్పుడు ధోనితో కలిసి పెప్పీ పానీయాన్ని కొంచెం త్రాగి ధోనితో నీలో జోరుందా? నేస్తం..నాదగ్గర ఉంది..అదే ..మరి నీకు కావాలా ఆ జోరు అని అంటే అందుకు ధోని అవును నాకూ కావాలి ఆ విన్నింగ్ జోరు..అంటాడు..తర్వాత ధోని కూడా పెప్పీ త్రాగి, నిజంగా ఇందులో జోరుంది అని అంటాడు.
వీరిద్దరి మధ్య జరిగే ఈ సన్నివేశాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరించాడు. చరణ్, ధోనిలతో ఈ యాడ్ అత్యంత అద్భుతంగా రావడంతో చరణ్ ఎప్పటికీ పెప్సీ అంబాసిడర్ గా ఉంటాడని సదరు కంపెనీ తెలుపుతుంది. వేర్సాటు వాదులను పూచికపుల్లలా తీసేసిన పెప్సీ సంస్థపై మళ్లీ దాడి చేయాలని వేర్సాటు వాదులు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం మరి ధోని ఆపద్బాందవుడిలా ప్రక్కన ఉండగా చరణ్ కేల చింత!


Click it and Unblock the Notifications











