మెగా వపర్ స్టార్ రామ్ చరణ్... ‘అదుర్స్ 2’
అదుర్స్2 అంటే కొంప తీసి 'అదుర్స్' సినిమా సీక్వెల్ అనుకోవద్దు సుమీ. అసలు వివరాల్లోకి వెళితే....ఈ టీవీలో 'అదుర్స్2' అనే రియాల్టీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈషోకి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో...రామ్ చరణ్ బాబాయ్ నాగబాబు కూడా ఒకరు. తాజాగా అందిన సమాచారం ప్రకారం త్వరలో జరుగబోయే 'అదుర్స్ 2' గ్రాండ్ ఫైనల్ కు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
అద్భుతమైన విన్యాసాలు, వినూత్నమైన డాన్సింగ్ స్టెప్పులు, రకరకాల వెరైటీ కార్యక్రమాలతో ఏపీలో టాప్ రియాల్టీ షోలలో ఒకటిగా నిలిచింది 'అదుర్స్ 2'. దీన్ని సినీ నిర్మాణ సంస్థ 'మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్' సంస్థ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో ఈ సంస్థ తరుపున ప్రొడ్యూస్ అయిన 'ఢీ' కార్యక్రమానికి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా హాజరయ్యారు. ప్రముఖలను షోకి ఆహ్వానించడం ద్వారా టీఆర్పీ రేటింగులు పెరుగుతాయనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.
స్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం, అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో మరో సానిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











