For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌తో ‘యముడికి మొగుడు’ ఆడియో!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్, రీచా పనయ్ జంటగా రూపొందుతున్న చిత్రం 'యముడికి మొగుడు'. ఇ సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీకి వినోదాన్ని మేళవించి రూపొందిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 25న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు.

    'యముడికి మొగుడు' చిరంజీవి గతంలో నటించిన చిత్రం టైటిల్ కావడంతో ఆటోమేటిక్ గా అందరి దృష్టి దీనిపై పడింది. సినిమాకు మరింత హైప్ తేవడంలో భాగంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రం ఆడియో వేడుకకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రేపు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగే ఆడియో వేడుకకు రామ్ చరణ్ హాజరై ఆడియోను ఆవిష్కరించనున్నాడు.

    ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...నరేష్, తాను కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది, పూర్తి వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు సత్తిబాబు వెల్లడించారు. స్విట్జర్లాండ్ పాట కూడా ఎంతో బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, రమ్య కృష్ణ, నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు తారాగణం.

    ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం, కె. రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కిరణ్ కుమార్, ఫైట్స్: గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

    English summary
    Yamudiki Mogudu's audio is going to be launched in a grand way at Shilpakala Vedika on November 25 and Ram Charan is going to be the chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X