విదేశాల్లో రామ్ చరణ్ కి హ్యాండ్సమ్ రగ్గ్ డ్ హీరో అనే క్యాప్షన్..!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇక్కడివారికి నచ్చాడో?లేదో? అనే విషయం పక్కన పెడితే విదేశీయులకు మాత్రం తెగ నచ్చేశాడు. తాజాగా రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ సినిమాకు ఆస్ట్రేలియా మీడియా పెద్ద యెత్తున కవరేజీ ఇస్తోంది. ఈ మూవీ కవరేజీ కోసం సిడ్నీ హెరాల్డ్ మొదలు అన్ని పత్రికలు గత కొద్ది రోజులుగా స్థలాన్ని కేటాయిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సిడ్నీ హెరాల్డ్ మార్నింగ్ రామ్ చరణ్, జెనీలియా ఫొటోలను రెండింటిన ప్రచురించి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఫాల్స్ ఫర్ హ్యాండ్సమ్ రగ్గ్ డ్ హీరో అనే క్యాప్షన్ పెట్టింది. ది మ్యాన్లీ డైలీ ఆరెంజ్ మూవీ ఆ వార్తాకథనాన్నిప్రచురించింది. మ్యాన్లీ డైలీ కార్యాలయానికి సమీపంలో ఉన్న మ్యాన్లీ బీచ్ లో ఆరెంజ్ షూటింగ్ జరుగుతోంది. తీవ్రమైన చలిలోనూ రామ్ చరణ్, ఇతర యూనిట్ సభ్యులు షూటింగ్ చేయడం పట్ల మ్యాన్లీ డైలీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు సిడ్నీ హెరాల్డ్ ram charan teja orange genelia bommarillu bhaskar nagababu sidney herald


Click it and Unblock the Notifications