‘రామ్ చరణ్ నాకు 3 ఏ.ఎమ్.ఫ్రెండ్’
'నువ్వు నాకు 3 ఏ.ఎమ్.ఫ్రెండ్ ..అర్ధమయిందా?' అంటూ రామ్‌చరణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో దగ్గుపాటి రానా రీసెంట్ గా పోస్ట్ చేశాడు. అంతకు ముందు త్రిష ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో 'రానాతో నాకు పది సంవత్సరాలుగా చక్కటి సాన్నిహిత్యముంది. అతను నాకు 3 ఏ.ఎమ్ ఫ్రెండ్' అని చెప్పుకొచ్చింది. దాంతో ఈ 3 ఏ.ఎమ్. ఫ్రెండ్ హడావిడి ఏమిటి..అని అందరిలో ఆసక్తి పెరిగింది. దానికి తోడు వెంటనే రామ్ చరణ్ కూడా ఇంతకీ 3 ఏ.ఎమ్.ఫ్రెండ్ అంటే అర్దం ఏమిటో చెపుతారా అని ట్వీట్ చేసారు. ఇంతకీ 3 ఏ.ఎమ్ ఫ్రెండ్ అంటే రెగ్యులర్ గా రోజూ టచ్ లో లేకపోయినా...చిన్న చిన్న విషయాల కోసం రాత్రి మూడు గంటలకు ఫోన్ చేసి లేపినా విసుక్కోకుండా మాట్లాడే ప్రెండ్ అని అర్దం. మొత్తానికి త్రిష,రానా,రామ్ చరణ్ ల హంగామాతో ఈ 3ఏ.ఎమ్ ఫ్రెండ్ అనేది పాపులర్ అయ్యింది. ఇక ప్రస్తుతం త్రిష..ఎన్టీఆర్ సరనస దమ్ము చిత్రం చేస్తూ బిజీగా ఉంది. రామ్ చరణ్ తన రచ్చ చిత్రంలో హడావిడిగా ఉన్నాడు. రానా అయితే నా ఇష్టం సినిమాతో తెలుగులో నిలదొక్కుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలా ఎవరికి వారు బిజీగా ఉంటూ తమ తమ పరిధుల్లో 3 ఏ.ఎమ్.ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











