రామ్ చరణ్ తేజ పెప్సీకి ఆంధ్రప్రదేశ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ చేసిన అసైన్ మెంట్ ఇది. బాబాయి బాడీ లాంగ్వేజ్ నే అలవర్చుకున్న రామ్ చరణ్ పెప్సీ దృష్టిలో పడ్డాదు. చాలా మంది యువ హీరోలను పరిశీలించినా పెప్సీ చివరికి రామ్ చరణ్ నే ఎంపిక చేసింది. "యంగిస్ధాన్" పేరుతో పెప్సీ రామ్ చరణ్ తో ప్రచారం చేయనుంది. డాడీ థమ్సప్ కి, బాబాయి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నప్పుడు తాను కూడా ఆ స్ధాయికి ఎప్పుడొస్తానని అనుకునేవాడినని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని రామ్ చరణ్ అన్నాడు. బ్రాండ్ అంబాసిడర్ గా పెప్సీ నుంచి ఈ చిచ్చర పిడుగు ఎంత పుచ్చుకుంటాడో అన్నది రహస్యం. అయితే వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు చెప్పాడు.