రామ్ చరణ్ యాక్సిడెంట్ మ్యాటర్ పై అఫీషియల్ గా...
హైదరాబాద్ : రామ్ చరణ్ కి నాయక్ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తూండగా..యాక్సిడెంట్ అయ్యిందని, అపోలోలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ చరణ్ పబ్లిసిస్ట్ అఫీషియల్ గా మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ విషయాన్ని ఖండించారు. కేవలం రూమర్ అని కొట్టిపారేసారు.
పబ్లిసిస్ట్ మాటల్లో... " మెగా పవర్ స్టారక్ రామ్ చరణ్ ఏ యాక్సిడెంట్ కి గురి కాలేదు. అలాగే ఏ గాయమూ అవలేదు..ఏ విధమైన ట్రీట్ మెంట్ తీసుకోవటం లేదు. ఆయన ఆరోగ్యంగా బావున్నారు. నాయక్ షూటింగ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. దయఉంచి ఏ రూమర్స్ ని నమ్మవద్దు. ," అన్నారు. అలాగే ఈ యాక్సిడెంట్ మ్యాటర్ కొందరు రూమర్స్ క్రియేట్ చేసే వారి సృష్టి అని తేల్చారు.
రామ్‌చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











