'రచ్చ'లో రామ్ చరణ్ మెడికో కాదు..మరి
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ఈ రోజే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ వైద్య విద్యార్థిగా కనిపిస్తారని వార్తలు వినిపించాయి. అయితే అవేమీ నిజం కాదని దర్శకుడు సంపత్ నంది కొట్టిపారేస్తున్నారు. ఆ విషయమై ఆయన మాట్లాడుతూ..అలాంటిదేమీ లేదు...ఇదో బస్తీ కుర్రాడికీ, కలవారి అమ్మాయికీ మధ్య నడిచే కథ. అలాగని ప్రేమకథ కాదు... కానీ సినిమాలో ప్రేమ ఉంటుంది. కేవలం చరణ్ ఓ సన్నివేశంలో తెల్ల కోటు వేసుకొని మెడికో అవతారం ఎత్తుతారు. అదెందుకో.. తెరపై చూస్తేనే బాగుంటుంది అన్నారు.
అలాగే 'రచ్చ'తన దృష్టిలో ఏమనుకున్నాడో చెప్తూ... ఒక్క మాటలో చెప్పాలంటే మాస్‌కి స్త్టెల్ తోడైతే 'రచ్చ'. మాస్ సినిమా అంటే ఇలా ఉంటుంది.. అని కొన్ని సమీకరణాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా 'రచ్చ' ఉంటుంది అన్నారు. ఇక రామ్ చరణ్ ని ఈ కథకు ఒప్పించిన విధానం చెప్తూ...మంచి కథ చెప్పే ఒప్పించా. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రమిది. కథలో మలుపులు సినిమాని కొత్తదారిలో నడిపిస్తాయి. ఇవన్నీ నచ్చే.. చరణ్ ఈ సినిమా చేస్తానన్నారు అన్నారు.
అలాగే రచ్చ కథని అందరికంటే ముందు కథ విన్నది చిరంజీవి అని చెప్పారు. 'చాలా బాగుంది. చరణ్‌కి బాగుంటుంది.. కానీయ్..' అని భుజం తట్టారు అని చెప్పారు. ఇక చరణ్‌లో చిరంజీవిని చూసుకొంటున్నారు. అందుకే చిరు అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. పైగా 'గ్యాంగ్‌లీడర్' సినిమాలోని 'వానావానా వెల్లువాయె' పాటంటే నాకు చాలా ఇష్టం. రచ్చలో సందర్భం కూడా కలిసొచ్చింది. నా ఆలోచన చరణ్‌కీ నచ్చింది. దాంతో రీమిక్స్ చేశాం.
ఇక నాకు మాస్ సినిమాలంటేనే ఇష్టం. తొలి సినిమానే ఓ పెద్ద హీరోతో ఆ తరహాలోనే చేద్దామనుకొన్నా. కథ చెబితే అందరూ 'బాగుంది... ఆ కథ మాకిస్తావా?' అనేవారే. 'నేనే దర్శకత్వం వహిస్తా' అనగానే వెనకడుగు వేసేవారు. దాంతో నన్ను నేను నిరూపించుకోవడానికి ఓ సినిమా చేయాలనిపించింది. అదే 'ఏమైంది ఈ వేళ'. ఆ సినిమా చూసి పలువురు నిర్మాతలు నా దగ్గరకు వచ్చారు. 'ఇలాగే తక్కువ బడ్జెట్‌లో ఓ యువతరం సినిమా తీయ్' అన్నారు. నా దృష్టేమో... మాస్, యాక్షన్‌లపై ఉండేది. తీస్తే నా అభిరుచులకు అనుగుణంగా సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకొన్నాను అని రచ్చ గురించి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











