సంక్రాంతి బరి నుంచి రామ్ చరణ్ ఔట్!
హైదరాబాద్ : హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో 'నాయక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు గతంలో ప్రకటించినప్పటికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
జనవరి నెలాఖరులో లేదా....ఫిబ్రవరి మొదటి వారంలో ఈచిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. సంక్రాంతి చాలా సినిమాలు విడుదలవుతుండటం, థియేటర్ల కొరత తదితర కారణాల వల్ల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు.
మగధీర తర్వాత రామ్‌చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్ చేయనున్నారు. ''మాస్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్ చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే : ఆకుల శివ, సంగీతం : తమన్, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : వివి వినాయక్.


Click it and Unblock the Notifications











