twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌తో కనెక్ట్ అవ్వడం కష్టం, బన్నీ అలా కాదట!

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ సమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీర, గోవిందుడు అందరి వాడేలే సినిమాలో చెర్రీతో కలిసి నటించిన సమీర్.... రామ్ చరణ్ చాలా హార్డ్ వర్కర్. కొంచెం రిజర్డ్వ్‌గా ఉండే మనిషి అని తెలిపారు.

    సెట్లో ఉన్నపుడు తన మ్యూజిక్ ఏదో తను వింటూ ఉంటాడు. అందరితో మాట్లాడతాడు, కలిసి భోజనం చేస్తాడు కానీ కొంచెం రిజర్డ్వ్ గా ఉంటారు. తనకు ఒకసారి కనెక్ట్ అయితే వదలడు. చరణ్ తో పర్సనల్‌గా కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమే అని తెలిపారు.

    బన్నీతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం. ఆయనది చాలా ఈజీ గోయింగ్ నేచర్. చరణ్ మనిషిని చూడగానే వీడు ఎలాంటి వాడు అని స్టడీ చేస్తాడు. చిరంజీవిగారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. వారు ముందు మనిషిని స్టడీ చేసి కరెక్ట్ అనుకుంటేనే కనెక్ట్ అవుతారు తప్ప అందరితో కనెక్ట్ అవ్వరు. చరణ్‌తో నేను ఈజీగానే కనెక్టవ్వగలిగాను అని తెలిపారు.

    Ram Charan is a reserved person: Sameer

    బిగ్ బాస్ షో ఎన్టీఆర్ చేసిన దాంతో నాని షో కంపేర్ చేస్తే.... లాంచింగ్ ఈవెంట్ కాస్త డల్ అనిపించింది. నానికి టీవీ షోలు కొత్త కాబట్టి అలా అనిపించింది. కానీ ఇపుడు షోను నాని సూపర్‌గా హోస్ట్ చేస్తున్నాడు. ప్రతివారం నాని హోస్టింగ్ షో కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    సీరియస్‌గా ఉండాల్సిన సమయంలో సీరియస్‌గా, నవ్వించే సమయంలో నవ్విస్తూ... సలహాలు ఇచ్చే సమయంలో సలహాలు ఇస్తూ మంచి వినోదం పంచుతున్నారు అని సమీర్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ 2లో ఎవరు విన్నర్ అయ్యేది చెప్పడం కష్టం... ఫైనల్ వరకు తనీష్, గీత మాధురి, రోల్ రైడా, బాబు గోగినేని వెళతారని అనిపిస్తోంది అని సమీర్ తెలిపారు.

    English summary
    Tollywood actor Sameer said that.. "Mega Power Star Ram Charan is a reserved person. It is difficult to connect with him, but once connected he will treat you as friend"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X