2019 News maker: ఆ విషయంలో రామ్ చరణ్ మించి ఇంకెవ్వరూ లేరు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019 సంవత్సరానికి గాను న్యూస్ మేకర్‌గా నిలిచారు. గతేడాది (2018) 'రంగస్థలం' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న ఈయన.. 2019 మొదట్లోనే విపరీతంగా వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఓ విషయం టాప్ ట్రెండింగ్‌ హీరో అయ్యారు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

సంక్రాంతి కానుక.. రామ్ చరణ్‌పై అంచనాలు

సంక్రాంతి కానుక.. రామ్ చరణ్‌పై అంచనాలు

రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత 2019 సంక్రాంతి కానుకగా 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు రామ్ చరణ్. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది.

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

తీరా 'వినయ విధేయ రామ' సినిమా విడుదలయ్యాక ''అనుకున్నదొకటి.. అయ్యిందొకటి'' అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలోని సీన్స్ చూసి షాకయ్యారు టాలీవుడ్ ప్రేక్షకులు. రియాలిటీకి ఏ మాత్రం దగ్గరగా లేకుండా ఫైట్స్, డైలాగ్స్ ఆశ్చర్యపోయారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి మెగా అభిమానులు సైతం తట్టుకోలేక పోయారు.

ఈ కారణం గానే రామ్ చరణ్..

ఈ కారణం గానే రామ్ చరణ్..

ఈ కారణం గానే రామ్ చరణ్ 2019 న్యూస్ మేకర్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమాను ట్రోల్ చేసినంతగా ఈ ఏడాదికి గాను మరే సినిమాను ట్రోల్ చేయలేదు నెటిజన్లు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాపై ఆన్‌లైన్ వేదికలపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. దీంతో 2019 సంవత్సరంలో అత్యధికంగా ట్రోల్ చేయబడిన హీరోగా రామ్ చరణ్ నిలిచారు.

RRR విషయమై చెర్రీ..

RRR విషయమై చెర్రీ..

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న కారణంగా కూడా ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అప్‌డేట్స్ కోసం తెగ వెతికారు నెటిజన్లు.

 RRR మూవీ.. 2020 హంగామా

RRR మూవీ.. 2020 హంగామా

RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్‌లో నటిస్తున్నాడు. చిత్రంలో రామ్ చరణ్- ఆలియాలపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2020 జులై నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X