రీమేక్: రామ్ చరణ్‌పై ఒరిజినల్ హీరో కామెంట్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళంలో హిట్టయిన ‘థాని ఒరువన్' చిత్రం తెలుగు రీమేక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అయినా రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో డేరింగ్ స్టెప్ వేసారు. రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద స్పాయిల్ అయ్యే ఛాన్సే లేదు, మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు....ఒరిజినల్ వెర్షన్లో నటించిన తమిళ స్టార్ జయం రవి.
తేల్చుకోలేక సుకుమార్, నిర్ణయం చరణ్ కే
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...‘రామ్ చరణ్ థాని ఒరువన్ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేస్తున్నారనే విషయం తెలియగానే హ్యాపీగా పీలయ్యాను. ఎందుకంటే రామ్ చరణ్ వండర్ ఫుల్ యాక్టర్. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని ఓ ఇంటర్వ్యూలో' అన్నారు.
పార్టీల్లో, గేదరింగ్ లలో చరణ్, చిరు, బన్ని ఇలా...(రేర్ ఫోటోలు)

ఈ చిత్రానికి ప్రస్తుతం ‘ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని పిఆర్ఓ బిఏ రాజాు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 18 నుండి సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పక్కా ప్లానింగుతో షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఎక్సక్లూజివ్: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)
జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అరవింద స్వామి క్రిమినల్ పాత్రలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ రోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











