‘జేమ్స్ బాండ్’గా కనిపించబోతున్న రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటి వరకు తను నటించిన చిత్రాల్లో లవర్ బాయ్‌గా, పోరాట యోధుడిగా, యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా మాత్రమే కనిపించారు. త్వరలో చెర్రీ మరో సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నారు. జేమ్స్ బాండ్ అవతారంలో కనిపించబోతున్నాడు.
రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'జంజీర్'లోని 'ముంబై కా హీరో' చిత్రంలో చెర్రీ జేమ్స్ బాండ్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో 'జంజీర్' చిత్రం రూపొందుతోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్ మరో భారీ విజయానికి దారి తీస్తుందనే అంచనాలున్నాయి.
రామ్ చరణ్ మరో వైపు తెలుగులో 'ఎవడు' చిత్రం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











