ఈ రోజే జాయిన్ అయిన రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తాజాగా ఈ రోజు(ఆగస్టు 7) 'ఎవడు' షూటింగులో జాయిన్ అవుతున్నాడు. కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, అమీ జాక్స్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి ఔట్ అయింది అనే వార్తలు వస్తున్న ఇంకా సరైన క్లారిటీ రాలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీ స్టారర్ మూవీగా చెబుతున్నారు 'ఎవడు' యూనిట్ సభ్యులు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి అద్భుతమైన బాణీలు సమకూర్చుతున్నారు. జనవరిలో ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











