For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR కోసం ఒకేసారి పని పూర్తి చేసిన చరణ్, తారక్.. అసలైన వర్క్ ఫినిష్.. మరో సర్‌ప్రైజ్‌ రెడీ!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో RRR సినిమా నెంబర్ వన్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. బాహుబలి లాంటి విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు అని అర్థమైంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందని ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు సినిమా బిజినెస్ చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

  పాన్ ఇండియా మార్కెట్ స్థాయిని బాహుబలి కంటే అత్యధిక స్థాయిలో పెంచుతుందని కూడా అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. అజయ్ దేవగన్ ఈ సినిమాలో మరో బలమైన పాత్ర లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. సినిమా పనులన్నీ కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా షూటింగ్ పనులు అయితే మొత్తం పూర్తయినట్లు ఇదివరకే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

  దర్శకుడు రాజమౌళి మొదట అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవల తెలుగు మలయాళం తమిళం భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి పూర్తి చేసినట్లు సమాచారం. వీలైనంత వరకు సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో అన్ని భాషలకు డబ్బింగ్ చెప్పించి ఆ తర్వాత సెట్ అవ్వకపోతే మరొకరితో చెప్పించాలని అనుకుంటున్నారు. ఇక ఫైనల్ కట్ సీజీ వర్క్స్ కు ఇంకాస్త ఎక్కువ సమయం పఫుతుంది. దర్శకుడు ఆ పనులన్నింటిని దగ్గరుండి ఫినిష్ చేయించాల్సి ఉంది.

  Ram charan jr ntr finished RRR movie dubbing work and latest update

  అలాగే మరోవైపు ప్రమోషన్ డోస్ పెంచాలని కూడా చూస్తున్నారు. త్వరలోనే మరొక సాంగ్ ను విడుదల చేయాలని ఇటీవల దర్శకుడు రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తో మాట్లాడినట్లు సమాచారం. దసరా సందర్భంగా కూడా RRR నుంచి ఒక సర్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ప్రమోషన్ విషయంలో అయితే ఏమాత్రం తగ్గకూడదని రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మొన్న విడుదలైన మొదటి సాంగ్ అయితే అనుకున్నంత స్థాయిలో అన్ని భాషల్లో సక్సెస్ అవ్వలేదు. ఆ విషయంపై కూడా ఆలోచించిన జక్కన్న నెక్స్ట్ విడుదల చేయబోయే సాంగ్ మాత్రం అన్ని భాషల్లో హిట్టవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

  ఇక సినిమా జనవరి 7న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట 2022న ఉగాదికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ దానిని ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ ఉండాలి అంటే సంక్రాంతి బెస్ట్ ఆప్షన్ అనుకొనే పోటీ ఉన్నప్పటికీ జనవరిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు ఇక్కడ ఈ సినిమా నిర్ణయంతో పోంగల్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

  English summary
  Ram charan jr ntr finished RRR movie dubbing work and latest update..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X