'జంజీర్' సెట్ పై రామ్ చరణ్ సాహసం (లీకైన ఫోటోలు)
హైదరాబాద్: రామ్ చరణ్ తాజాగా హిందీలో 'జంజీర్' రీమేక్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా స్టంట్స్ విషయంలో తనదైన ముద్ర ఉండటానికి రామ్ చరణ్ కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగానే ఉన్నాయి. అమితాబ్ చిత్రం రీమేక్ చేయటం ఓ కారణమైతే, రామ్ చరణ్ హిందీ ఎంట్రీ ఎలా ఉండబోతోందనేది అందరికీ ఆసక్తి కరమైన అంశం. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ లీకై అభిమానులను అలరిస్తున్నాయి.
ఈ 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సూచనల మేరుకు ఈ మార్పు జరిగినట్లు సమచారం. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రచ్చ విషయంలోనూ చిరంజీవి ఇలాగే దగ్గరుండి సినిమా చేయించుకున్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగు వెర్షన్ కి గానూ 'రుస్తుం' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. 'రుస్తుం' టైటిల్ తో గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే.
లీకైనా కొన్ని కొత్త ఫోటోలతో పాటు.. గతంలో వచ్చినవి కూడా... స్లైడ్ షోలో...

ఈ డేరింగ్ హీరో.. చాలా ఎత్తునుంచి కేబుల్స్ సపోర్ట్ లేకుండా దూకటం షూటింగ్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. లైఫ్ రిస్కీ స్టంట్ గా దీన్ని బాలీవుడ్ అభినందిస్తూ మెచ్చుకుంటోంది.

రామ్ చరణ్ కి ప్రతినాయకుడు షేర్ ఖాన్ గా... సంజయదత్ చేస్తున్నాడు.. వీరిద్దరూ కలిసినప్పటి దృశ్యం.

దర్శకుడు అపూర్వ లఖియా... రామ్ చరణ్ కి సీన్ వివరిస్తున్నాడు.

ఇదే సంజయ్ దత్.. షేర్ ఖాన్ గెటప్. పాత షేర్ ఖాన్ ని మరిపిస్తాడని ప్యాన్స్ అంటున్నారు.

హీరో, హీరోయిన్, విలన్ ఒక్కచోట చేరారు.. మరి ఏం మాట్లాడుకుంటున్నారో..

హీరోయిన్ తో హీరోగారి ముచ్చట్ల సీన్...

సినిమాలో చరణ్ గెటప్ ఇదే.. అదిరిపోతోంది కదా.

సీన్ లో లీనమయినప్పుడు... రామ్ చరణ్ సీరియస్ నెస్.

దర్శకుడు... సీన్ చేసి ఏం చెయ్యాలో చెప్తున్నాడు.

హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మీడియాకు ఇలా ఫోజిచ్చారు.


Click it and Unblock the Notifications











