‘నాయక్’ టాక్‌పై రామ్ చరణ్, కాజల్ స్పందన
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'నాయక్' చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రొటీన్ కమర్షియల్ ఫార్ములా అయినా.... సినిమా బోరింగ్ లేకుండా ఉండటంతో ప్రేక్షకాదరణ బాగానే దక్కుతుంది. ఇక మెగా అభిమానులకు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండటం సినిమాకు బాగా ప్లస్ అయింది.
తమ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా విజయంపై హీరో రామ్ చరణ్, హీరోయన్ కాజల్ స్పందిస్తూ..... ఈ విజయం తమకు ఎంతో థ్రిల్ ఇచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేసారు. హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ...'మగధీర చిత్రం కోసం మేము కాలా కాలం కలిసి పని చేసాం. అందుకే మా ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ మంచి అండర్ స్టాడింగ్ ఉంటుంది.
ఈ చిత్రంలో రెండు క్యారెక్టర్లు చేసిన చరణ్ రెండు పెర్ఫార్మెన్స్‌ల్లో చాలా వైవిధ్యత కనబర్చాడు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముందు నేను వివి వినాయక్ కి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లనే రామ్ చరణ్‌తో మళ్లీ నటించే అవకాశం దక్కింది. ఆయన కథ చెప్పినప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఏర్పడింది' అంటూ చెప్పుకొచ్చింది.
కాగా తొలి రోజు గ్రాండ్ గా 1200లకు పైగా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన నాయక్ చిత్రం.... భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు కేవలం ఏపిలోనే దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరిగి పాత రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కూడా లేక పోలేదు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించిది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











