For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ 'నాయక్ ' లేటెస్ట్ ఇన్ఫో

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నటి వరకూ శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట రీమిక్స్ ని అమలా పౌల్,రామ్ చరణ్ లపై చిత్రీకరించారు. రామ్ చరణ్, కాజల్ ఇద్దరూ ఈ రోజు(ఆగస్టు 27,2012)నుంచీ ఐస్ ల్యాండ్ లో రొమాన్స్ చేసుకోనున్నారు. వీరిద్దరి మధ్యా అక్కడ రెండు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రం 2013 సంక్రాతికి విడుదల కానుంది.

  ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా,ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

  ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు అన్నారు.

  జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

  English summary
  From today (August 27, 2012), two more songs are being canned in Iceland on Ram Charan and Kajal Agarwal for the same film. Music is composed by S S Taman. Shoot of the remix song - Subhalekha Rasukunna Eppudo - has been completed. The song was filmed on Ram Charan and Amala Paul at the picturesque locations of Iceland. This song is for the film, Nayak, under the direction of V V Vinayak. Nayak is set for release for Sankranthi 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X