చిరంజీవిని మెగాస్టార్ చేసిన చిత్రం రామ్ చరణ్ కి ఓ మైల్ స్టోన్ కానుంది..!?
టాలీవుడ్ లో చిరంజీవిని మెగాస్టార్ చేసిన చిత్రం 'ఖైదీ" ఈ చిత్రానికి ముందు చిరంజీవి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ వాటివల్ల వచ్చిన పేరు అంతంతమాత్రమే అయితే 'ఖైదీ" చిత్రం విడుదలైన తర్వాత చిరంజీవికి వచ్చిన స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న చేయబోతున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే 'ఖైదీ"ని మళ్ళీ చెయ్యాలన్నది రామ్ చరణ్ డ్రీమ్. అతని డ్రీమ్ నిజం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ ఏవిషయమూ అఫిషియల్ గా బయటికి రాలేదు.
ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రం పునర్ నిర్మితం కానుంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మాత కె అచ్చిరెడ్డి 'ఖైదీ" చిత్రం పేరుతో ఫిలిమ్ ఛాంబర్‌లో ఓ టైటిల్‌ను నమోదు చేయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మొత్తం స్క్రిప్ట్ వర్క్ తో పాటు అన్ని పక్కాగా ప్లానింగ్ చేసిన తర్వాతే చిత్ర విశేషాలను వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిందని కాబట్టి 'ఖైదీ"ని ఈ ట్రెండ్ కు సూటైయే విధంగా స్క్రిప్ట్ మార్చి వర్కవుట్ చేస్తే రామ్ చరణ్ కెరీర్ లోనూ అదో మైల్ స్టోన్ అవుతుందన్నది సినీ పండితుల అభిప్రాయం. కాగా 'ఖైదీ"లోని యాంటీ క్లైమాక్స్ ని మరో యాంగిల్ కి మార్చి హీరోయిజాన్ని ఇంకా హైట్స్ కి తీసుకువెళ్లే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. సో నిజంగా ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే ఖచ్చితంగా 'మగధీరు"ని ఖాతా లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications











