Game Changer Public Talk: జగన్‌కు వార్నింగ్ ఇచ్చి గద్దె దించిన పవన్ కల్యాణ్.. అదే గేమ్ ఛేంజర్!
Game Changer Public Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్'( Game Changer ). పొలిటికల్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా నేడు ( జనవరి 10)ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ తరుణంలో వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ.. ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి.
RRR వంటి పాన్ మూవీతో రామ్ చరణ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమాతో స్టార్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు. తాజాగా రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ డూయల్ రోల్ నటించగా.. అంజలి, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. RRR తరువాత అంతే రేంజులో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చారు.ఈ సినిమాతో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడా..? లేదా? ఈ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓ లూక్కేయండి.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు మిక్డ్స్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ రావడంపై కొందరు అభిమానులు, సినిమా లవర్స్. ఇటీవల కాలంలో ఏ హీరో సినిమా విడుదలైన తరువాత నెగటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారని, మెగా ఫ్యామిలీ పై కొంతమంది చిన్న చూపు చూస్తున్నారని, వారి సినిమాలు రిలీజ్ కాకముందే.. నెగిటివ్ ప్రచారం ప్రారంభిస్తున్నారని అలాంటి వారిని మనం మార్చలేం అన్నారు. గేమ్ చేంజర్ ఫస్ట్ ఆప్ చాలా చక్కగా బాగుందని, ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రలో ఒదిగిపోయాడని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అనేది.. చాలా స్పష్టంగా క్లియర్ గా చూపించారని కామెంట్ చేశారు.
రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడని, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని సినిమా చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. అప్పన్న పాత్ర రంగస్థలంలో చిట్టిబాబు కి మించి ఉందని...గేమ్ ఛేంజర్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా చూస్తే సంక్రాంతి ముందే వచ్చిందన్న భావన కలుగుతుందని, రంగస్థలం తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని ప్రశంసించారు.

ఈ సినిమాలో ఏపీ రాజకీయాలను ప్రస్తావించారని, ఇందులో కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న అక్రమాలను ఇన్ డైరెక్ట్ గా చూపించారని, పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అనే డైలాగ్ కు న్యాయం చేశారని, అన్ని వ్యవస్థల్లో అవినీతి ఎలా పేరుకుపోయిందనే.. విషయాలను ఈ సినిమాలో స్పష్టంగా చూపించాలని పేర్కొన్నారు. ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ నటించిన తీరు చాలా బాగుందని, పాలన వ్యవస్థలలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో దర్శకుడు చూపించాడని వివరించారు.
'జగన్మోహన్ రెడ్డిని గద్దదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. నా పార్టీ జనసేననే కాదు.. అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసింది. ఆ విషయాన్ని ఇందులో చూపించారు. ఓవరాల్ గా రాంచరణ్ నటన అద్భుతంగా ఉందని, ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడంట. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమాలో ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ బాగా వచ్చిందట. ఫస్ట్ హాఫ్ బాగుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట.


Click it and Unblock the Notifications











