హీరోయిన్‌తో కలిసి జిమ్‌లో రామ్ చరణ్ వర్కౌట్స్ (వైరల్ వీడియో)
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల అక్కడ వర్షాల కారణంగా షూటింగ్‌కు చిన్నపాటి అంతరాయం జరిగింది. ఈ గ్యాపులో ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపారు చెర్రీ. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన ట్విట్టర్లో పోస్టు చేశారు. దీంతో పాటు హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి చరణ్ జిమ్ వర్కౌట్స్ చేస్తున్న వీడియో కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బ్యాంకాక్‌లో ఉపాసన కూడా
రామ్ చరణ్‌తో ఉపాసన కూడా బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. చరణ్ చేపలకు ఆహారం వేస్తుండగా ఉపాసన స్వయంగా వీడియో తీసి పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌తో కలిసి చరణ్ వర్కౌట్స్
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్యాంకాక్‌లో ఇద్దరూ కలిసి జిమ్ వర్కౌట్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను కూడా ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ముఖ్య పాత్రల్లో ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్
ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రశాంత్(జీన్స్ మూవీ ఫేం), బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

#ఆర్‌సి12
రామ్‌చరణ్, కైరా అద్వాని, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్, కో-ప్రొడ్యూసర్: డి. కళ్యాణ్, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











