రామ్ చరణ్ బాక్సింగ్ వీడియో వైరల్‌లా వ్యాపించింది
హైదరాబాద్: రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్రను పర్ ఫెక్టుగా పోషించేందుకు చాలా కష్టపడుతున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘మై నేమ్ ఈజ్ రాజు' పేరుతో పిలుస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటించబోతున్నాడు. పాత్రలో రియాల్టీ కోసం థాయ్ లాండ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని జైకా స్టంట్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు చరణ్. థాయ్‌లాండ్ లోని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లలో ఇదీ ఒకటి. ఇక్కడ రామ్ చరణ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను జైకా స్టంట్ టీమ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ వీడియోలను మెగా అభిమానులు షేర్ చేయడంతో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది.
Jaika stunts
Posted by JaiKa Stunts on Monday, April 20, 2015
ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. క్రితి కర్బంధ ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటిస్తోందట. సినిమా ప్రధానం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందట. ఇక ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Jaikastunts
Posted by JaiKa Stunts on Wednesday, April 22, 2015
విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్ అనీ నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











